Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోదా బిల్లుపై ఓటింగ్ జరపాలని టీడీపీ ఎంపీలు ఎందుకు ప‌ట్టుబ‌ట్టలేదు?: ర‌ఘువీరారెడ్డి సూటి ప్ర‌శ్న‌

రాజ్యసభలో ఈరోజు ఏపీ ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్‌కు రాక‌పోవ‌డం ప‌ట్ల టీడీపీ, బీజేపీ నేత‌ల‌పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఈరోజు బ్లాక్ డే అని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చి ప్ర‌త్యేక హోదా బిల్లుపై కుట్ర పన్నారని ఆయ‌న ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంధ్రప్ర‌దేశ్‌ ప్రజలను మోసం చేశాయ‌ని ఆయ‌న అన్నారు. రాజ్య‌స‌భ‌లో ప్రత్యేక హోదాపై ఈరోజు ఓటింగ్ జరపాలని టీడీపీ ఎంపీలు ఎందుకు గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి కావ‌ల‌సింది కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు కాద‌ని, ఏపీకి ప్ర‌త్యేక రాష్ట్ర హోదానే అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News